చత్తీస్ గడ్ లో మావోయిస్టుల కుట్రభగ్నం

కౌరగుట్ట అడవుల్లో భారీ గొయ్యి.. పేలుడు పదార్థాలు స్వాధీనం

Update: 2025-10-01 14:04 GMT

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేసాయి. దీంతో భధ్రతాబలగాలు ఊపిరి పీల్చుకున్నాయి. పేలుడు పదార్థాలను, రోజువారి వస్తువులను ఉపయోగించే డంప్ బెటాలియన్ ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పామెడ్ ప్రాంతంలోని కౌరగుట్ట అడవుల్లో కోబ్రా 208 బెటాలియన్ బుధవారం కూంబింగ్‌ నిర్వహించింది. మావోయిస్టుల జాడ కోసం ఈ బెటాలియన్ ఇటీవలి కాలంలో మమ్మురంగా అన్వేషిస్తోంది. కౌరగుట్ట అడవుల్లో కంచల్ గ్రామంలోని ఒక పెద్ద గొయ్యి తవ్వి మావోయిస్టులు ఈ సామగ్రిని దాచిపెట్టారు. భారీ విధ్వంసానికే ఈ పేలుడు పదార్థాలు దాచి పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గన్ పౌడర్, బీజీఎల్ సెల్స్, కార్డెక్స్ వైర్, బీజీఎల్ రౌండ్లు, ఆర్‌డీఎక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, బాంబులు (ఇంప్రూవైజ్డ్), బారెల్స్‌లో ఉపయోగించే ఇనుప రాడ్‌లు, ఇంప్రవైజ్డ్ గ్రెనేడ్‌లు, క్రిస్టల్ షుగర్, రైఫిల్ బయోనెట్‌లు, ఇనుప పటకార్లను బలగాలు స్వాధీనం చేసుకొన్నాయి.

Tags:    

Similar News