రిపోర్టర్ పై దాడికేసులో మోహన్ బాబు విచారణ వాయిదా

హైకోర్టును గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాది;

Update: 2025-07-07 09:26 GMT

సినీ నటుడు మంచు మోహన్ బాబు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రిపోర్టర్ రంజిత్ పై దాడికేసులో సినీ నటుడు మోహన్ బాబుపై పహడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మోహన్ బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి పోలీసుల తరపు న్యాయవాది హైకోర్టును గడువు కోరారు. పోలీసుల తరపున న్యాయవాది అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించి విచారణను ఈ నెల 9 వతేదీకి వాయిదా వేసింది.

గతంలో రంజిత్ అనే విలేకరిపై దాడి చేశారన్న ఆరోపణలతో మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో మోహన్ బాబుకు ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది.

గతంలో మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం రచ్చ కావడంతో పహడీషరీఫ్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద కవరేజ్ చేయడానికి వచ్చిన రంజిత్ వచ్చారు. మోహన్ బాబు అతడిపై గన్ మైక్ తో దాడి చేశారు. దీంతో అతను తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. రిపోర్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాచకొండ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News