గర్భిణీకి సాధారణ ప్రసవం, కవల పిల్లల జననం

పురిటినొప్పులతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి కవల పిల్లలున్నా సాధారణ ప్రసవం చేయించిన వైద్య బృందం ప్రశంసలు అందుకుంది.;

Update: 2025-05-06 07:09 GMT
పాల్వంచ ఆసుపత్రిలో కవల శిశువులకు సాధారణ ప్రసవం

ప్రసూతి శాస్త్రంలో వైద్యులు కవల పిల్లలకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య బృందం తమకున్న అనుభవం, నైపుణ్యంతో కవల పిల్లలకు సాధారణ ప్రసవం చేయించి ప్రశంసలందుకుంది.


కవల శిశువులకు సాధారణ ప్రసవం
ప్రసవ వేదనతో ఓ గర్భిణీ పాల్వంచలోని కమ్యూనిటీ హెల్త్ సెంటరుకు వచ్చారు. గర్భంలో కవల పిల్లలున్నా సవాలుగా తీసుకున్న వైద్య బృందం సభ్యులు తల్లీ, శిశువులకు ఎలాంటి సమస్య ఏర్పడకుండా సాధారణ ప్రసవం చేశారు.

మంత్రసాని సుజాతకు అభినందనలు
మంత్రసాని సుజాత, పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు, నర్సులు చేసిన సాధారణ ప్రసవంతో తల్లీ,నవజాత కవల శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ప్రసవంలో మంత్రసాని సుజాత నైపుణ్యాన్ని పలువురు అభినందించారు.

వైద్యబృందానికి కలెక్టర్ ప్రశంస
పాల్వంచ ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది చేసిన కృషి మాతా శిశు సంరక్షణకు ఉదాహరణగా నిలిచింది.కవల పిల్లలకు సాధారణ ప్రసవం చేసిన డాక్టర్ రవిబాబు బృందాన్ని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు.



Tags:    

Similar News