చంచల్ గూడ జైలుకు ‘సృష్టి’ నిందితులు

అద్దెగర్బం పేరిట అక్రమాలు;

Update: 2025-07-27 11:43 GMT

సికింద్రాబాద్ లో యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిందితులకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ జడ్డి ఆదేశాలు ఇవ్వడంతో నిందితులను చెంచల్ గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నవారిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యూనివర్శల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతతో బాటు ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్స్ ను పోలీసులు ఆదివారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు.సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు విజయవాడ, వైజాగ్ లో బ్రాంచీలు ఉన్నాయి. అక్కడ పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుతో సంబంధమున్న ఇండియన్ స్పెర్మ్ సంస్థకు రీజినల్ మేనేజర్ మేనేజర్ గా వ్యవహరించే పంకజ్ సోనితో బాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోను గోపాలపురం పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో మారెడ్ పల్లిలోని జడ్జి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టారు. జడ్జి ఆదేశం మేరకు నిందితులను 14 రోజులపాటు చెంచల్ గూడ జైలుకు తరలించారు.

రాజస్థాన్ కు చెందిన బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఫెర్టిలిటీ సెంటర్ గూర్చి పోలీసులతో బాటు వైద్యాధికారులు ఆరా తీసారు. అధికారులు శనివారం రాత్రంతా ఈ సెంటర్ లో సోదాలు జరిపారు. పలు కీలక మైన డాక్యుమెంట్లను, అద్దెగర్బం కోసం సేకరించిన వీర్యకణాలు, అండాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన వీర్య కణాలను మధ్య ప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సృష్టి బేబిసెంటర్ కు ఇండియన్ స్పెర్మ్ సంస్థకు సంబంధాలున్నట్లు పోలీసులు తేల్చేశారు. వీర్యకణాలను సేకరించి ఇండియన్ స్పెర్మ్ సంస్థకు డాక్టర్ నమ్రత అమ్మేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ సంస్థ కూడా రెజిమెంటల్ బజార్ లోనే ఉంది.

Tags:    

Similar News