రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు : సీఎం హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై ఎస్మా యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఎ రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు.
By : The Federal
Update: 2024-11-11 08:05 GMT
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై సీఎం సమీక్షించారు.
- రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడొద్దు
రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (#ESMA) కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
— Telangana CMO (@TelanganaCMO) November 11, 2024
* ధాన్యం కొనుగోలు… pic.twitter.com/KsvGALVxqh