కామారెడ్డిలో కుండపోత వర్షం

కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీవర్షాలు...వరదలు;

Update: 2025-08-27 09:58 GMT
కామారెడ్డిలో అతి భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదలు

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాల్లో గడచిన ఆరుగంటల్లో అతి భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆకాశాసికి చిల్లులు పడినట్లుగా కుండపోత వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కామారెడ్డిలో 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. అతి భారీవర్షాల వల్ల గంటగంటకు వరద విపత్తు పెరుగుతోంది.




 లోతట్టు ప్రాంతాలు వరదనీటి చిక్కుకోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు రోడ్లు వరదనీటికి కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. కామారెడ్డిలో ఇప్పుడు ఏమి జరుగుతుందో వర్ణించలేని పరిస్థితులు నెలకొన్నాయి. గంట గంటకూ భయంకరంగా వరద పరిస్థితి మారుతోంది.




 రాజంపేటలో రికార్డు స్థాయిలో వర్షం

కామారెడ్డిలోని రాజంపేటలో అత్యధిక వర్షపాతం నమోదైంది. బుధవారం తెల్లవారుజామున 12 గంటల నుంచి నుండి ఉదయం 8 గంటల వరకు 136మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బుధవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు 363మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కామారెడ్డిలో కేవలం 14 గంటల్లోనే 499మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది విపత్తు కంటే ఎక్కువ అని తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పారు.



 మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో 3-4 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 600 మిల్లీమీటర్ల వర్షపాతం దాటే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ చెప్పారు. 2023 వ సంవత్సరంలో భూపాలపల్లిలోని చిట్యాల్ ప్రాంతంలో 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్థుత అతి భారీ వర్షాలు నాటి భూపాలపల్లి వదరలను గుర్తుకు తెస్తున్నాయి.



Tags:    

Similar News