కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య
చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
కుటుంబ కలతలతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.చర్లపల్లి పోలీసుల కథనం ప్రకారం మధుసూదన్ రెడ్డి నగర్ కు చెందిన బత్తుల గోపాల్ , ప్రసన్న దంపతులు గత మే నెలలో విడాకులు తీసుకున్నారు. వేర్వేరుగా ఉంటున్నారు. కూతురు సృష్టిత (21) తల్లి ప్రసన్నతో మధుసూదన్ రెడ్డినగర్ లో ఉంటోంది. తండ్రి బత్తుల గోపాల్ అదే బస్తీలో ఉంటున్నారు. డిగ్రీ చదువుతున్న సృష్టిత శనివారం ఇంట్లోనే ఉంది. తల్లి ప్రసన్నప్రయివేటు ఉద్యోగి. ఆఫీసు నుంచే మధ్యాహ్నం కూతురుతో మాట్లాడింది. మరోసారి ఫోన్ చేస్తే ఫోన్ లిప్ట్ చేయలేదు. ప్రసన్న స్థానికులను అప్రమత్తం చేసింది. స్థానికులు ప్రసన్న ఇంటికి వెళ్లి పిలిస్తే కూతురు పలకలేదు. తలుపులు బద్దలు కొట్టి చూస్తే విగత జీవిగా కనిపించింది. ఫ్యానుకు ఉరేసుకుంది. తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేధాలకు మనస్థాపం చెంది సృష్టిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.