‘మహారాష్ట్రను కాపాడే వారికే మద్దతు’

రానున్న ఎన్నికలలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారన్న విషయం పక్కన పెట్టి ముందుగా మహా వికాస్ అఘాడి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించాలని థాకరే పట్టుబడుతున్నారు.

Update: 2024-10-08 12:06 GMT

మహారాష్ట్రను కాపాడేందుకు కాంగ్రెస్ లేదా ఎన్సీపీ (శరత్ పవార్) ప్రకటించే ముఖ్యమంత్రి అభ్యర్థికే తన మద్దతు ఉంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో లడ్కీ బహిన్ స్కీమ్‌ కింద మహిళలకు ఇచ్చే రూ. 1,500 ప్రజల డబ్బేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారన్న విషయం పక్కన పెట్టి ముందుగా (మహా వికాస్ అఘాడి) MVA ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించాలని థాకరే పట్టుబట్టారు.కాగా శివసేన (యుబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్టాండ్ మహారాష్ట్రకు మేలు చేస్తుందని రౌత్ చెప్పారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

లడ్కీ బహీన్ యోజన పథకం..

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారంలో ఉన్న బీజేపీ శివసేన ఎన్సీపీ కూటమి లడ్కీ బహీన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులయిన ఒక్కో మహిళకు రూ.1500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్రంలోని కోటి మందికి పైగా మహిళలు ఈ స్కీం ద్వారా లబ్బి పొందనున్నారు. ఈ పథకానికి మహారాష్ట్రలో నివసించే మహిళలు మాత్రమే అర్హులు. దరఖాస్తుదారు వయసు 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. పెళ్లి అయిన మహిళలు, పెళ్లి కాని వారు, భర్త విడిచిపెట్టిన వారు, విడాకులు తీసుకున్న వారు, నిరుపేద మహిళలు మాత్రమే అర్హులు. దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2.5 లక్షలకు మించకూడదు. 

Tags:    

Similar News