ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై తొలి ప్రమాదం.. ముగ్గురు మృతి..

ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై తొలి ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి సమయంలో ఈ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరగింది.;

Update: 2025-01-28 07:01 GMT

ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై తొలి ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి సమయంలో ఈ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరగింది. అందులో అక్కడిక్కడే ఇద్దరు మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి అతివేగం, ట్రిపుల్ రైడింగే కారణమని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో మరణించిన ముడ్డురూ కూడా మైనర్లే అని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోల్కొండకు చెందిన మాజ్, అహ్మద్, తలాబ్‌కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్‌ ముగ్గురూ కడా కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్‌పై ఒకే బైక్‌పై వెళ్తున్నారు. అతివేగం కారణంగా అదుపుతప్పిన వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. మృతులు బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం శివరాంపల్లి సమీపంలోకి రాగానే ఎలక్ట్రిక్ పోల్‌ను ఢికొట్టి డివైడర్ వైపు దూసుకెళ్లింది.

ఫ్లైఓవర్‌పై తొలి ప్రమాదం..

6 జనవరి 2025న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ 24మీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆరు లైన్ల ఈ ఫ్లైఓవర్‌ను రూ.799కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభం అయిన తర్వాత ఈ ఫ్లైఓవర్‌పై జరిగిన తొలి రోడ్డు ప్రమాదం ఇదే. ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం ఫ్లైఓవర్‌ను నిర్మించగా.. దానిపై ప్రమాదాలు జరగడంపై అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన క్రమంలో ఫ్లైవర్‌పై ట్రాఫిక్ నియంత్రణ కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్థం కాకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగంగా ప్రయాణించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తల్లిదండ్రులదే తప్పు..

ఈ ఘటనపై స్పందిస్తున్న ప్రజలు.. ఇందులో మృతులది ఎంత తప్పుందో.. వారి తల్లిదండ్రులది కూడా అంతే తప్పుందని అంటున్నారు. మైనర్లకు బైక్ ఎలా ఇచ్చారని నిలదీస్తున్నారు. అంతేకాకుండా అర్థరాత్రుల వరకు మైనర్లు బయట తిరుగుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని? వారిని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత వారిది కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో మైనర్లకు బైక్ ఇచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, వారి నిర్లక్ష్యం వల్లే మూడు ప్రాణాలు పోయాయని మండిపడుతున్నారు.

Tags:    

Similar News