తెలంగాణలో ఐఏఎస్ లకి అదనపు బాధ్యతలు, బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Update: 2024-08-31 17:00 GMT

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐఏఎస్ ల బదిలీలు, అదనపు బాధ్యతలకు సంబంధించి ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 1167 జారీ చేసింది. శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి పేరిట ఉత్తర్వులు వెలవడ్డాయి. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానం ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను జిఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ స్థానంలో తఫ్సీర్ ఇక్బాల్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

అదనపు బాధ్యతలు ఎవరెవరికంటే...

కే. సు రేంద్రమోహన్ - గనుల శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు

షేక్ యాస్మిన్ భాషా - మైనార్టీ సంక్షేమ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు

టి. వినయ్ కృష్ణారెడ్డి - భూసేకరణ పునరావాస కమిషనర్ గా అదనపు బాధ్యతలు

నిర్మల కాంతి వెస్లీ - మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండిగా అదనపు బాధ్యతలు

జి. మల్సూర్ - రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండిగా అదనపు బాధ్యతలు

మహమ్మద్ అసదుల్లా - వక్ఫ్ బోర్డ్ సీఈవోగా నియామకం

పి. శ్రీజ - ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియామకం

Tags:    

Similar News