భూపతిపూర్ లో దొరికిన పురాతన కంకణశిల

6వేల యేండ్లనాటి అపురూపమైన కొత్తరాతియుగం పనిముట్టుని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు

Update: 2024-04-29 09:04 GMT

భూపతిపూర్ లో కంకణశిల

6వేల యేండ్లనాటి కొత్తరాతియుగం పనిముట్టు అపురూపమైన రాతిపరికరాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు

ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో గతంలో వృక్షశిలాజాలు దొరికిన ప్రదేశంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చీడం రవి 6వేల సం.రాల కిందటి కొత్తరాతియుగం నాటి కంకణశిల(Ring Stone)ను గుర్తించారు ఈ రాతిపరికరాన్ని తవ్వుకోల మీద బరువుగా, వలలను ముంచే బరువుగా, పూసలను మెరుగుపెట్టడానికి ఆధారంగా ఉపయోగపడేదని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అని వివరించారు.


ఇటువంటి శిలను సంగనకల్లులో ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొ. రవి కొరిసెట్టర్ తవ్వకాలలో సేకరించాడు. ఆ పరికరమిపుడు బెళ్ళారి మ్యూజియంలో ఉంది. ఇనుము కనుగొనని కాలంలోనే కఠినమైన డోలరైట్ రాయిని కంకణశిలగా మలచడం ఎట్ల సాధ్యమైందో అనిపిస్తుంది.

క్షేత్ర పరిశోధన: అహోబిలం కరుణాకర్-9398654646, మహమ్మద్ నసీరుద్దీన్,రవి కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు

చారిత్రక వివరణ: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

Tags:    

Similar News