పీఈటీ వేధింపులపై ఆగ్రహం, గురుకుల విద్యార్థినుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సాంఘీక సంక్షేమపాఠశాల, కళాశాలలో పీఈటీ జోష్ణ వేధింపులపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పీఈటీని తొలగించారు.

Update: 2024-09-12 05:30 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సాంఘీక సంక్షేమ పాఠశాల, కళాశాలలో పీఈటీ జోష్ణ వేధింపులపై విద్యార్థినులు గురువారం ఉదయం ఆందోళన చేశారు. పీఈటీ జోష్ణ తమను అకారణంగా బూతులు తిడుతూ ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని విద్యార్థినులు ఆవేదనగా చెప్పారు. పాఠశాల, కళాశాల విద్యార్థినులు తెల్లవారుజామున 5 గంటలకే సిరిసిల్ల- సిద్ధిపేట రోడ్డు పై బైఠాయించిన నిరసన తెలిపారు. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న పీఈటీ జోష్ణను వెంటనే సస్సెండ్ చేయాలని విద్యార్థినులు మూకుమ్మడిగా నినాదాలు చేశారు. జోష్ణ డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.


పీఈటీ కొడుతుంది...
బాత్ రూంలో తాము స్నానం చేస్తుంటే తలుపులు పగులగొట్టి బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ జోష్ణ కొడుతుందని విద్యార్థినులు ఆరోపించారు. తమను వేధిస్తున్న పీఈటీపై చర్యలు తీసుకోవాలని తాము ప్రిన్సిపాల్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు చెప్పారు. ఎంఈఓ, పోలీసులు వచ్చి విద్యార్థులకు నచ్చచెప్పినా విద్యార్థినులు నిరసన విరమించలేదు.

గురుకుల విద్యాలయంలో వసతులేవి?
తంగళ్లపల్లి గిరిజన సాంఘీక సంక్షేమ పాఠశాల,కళాశాలలో 580 మంది ఉంటే కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆరోపించారు. బాత్ రూంలు తక్కువగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.బహిష్టు సమయంలో బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా పీఈటీ జ్యోత్స్న ఎందుకు ఆలస్యం అయిందని వేధిస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు. ఆమె తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి మొబైల్ ఫోన్‌తో వీడియో రికార్డ్ చేస్తూ కొడుతోందని అశ్వనీ అనే విద్యార్థిని ఆరోపించింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన బాలికలు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు.

పీఈటీ జోష్ణ తొలగింపు
విద్యార్థినుల నిరసనతో అవుట్ సోర్సింగ్ పీఈటీ జోష్ణను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మండల విద్యాధికారి రఘుపతి ప్రకటించారు.తాను 5వతరతగతి నుంచి గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నా , పీఈటీ జోష్ణ వేధింపులపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు పట్టించుకోలేదని అశ్వనీ ఆరోపించారు.‘‘ పిరియడ్స్ వచ్చినపుడు ఆడపిల్లను బట్టలేకుండా కొడుతుంది. కదిలేది లేదు.పీఈటీని సస్సెండ్ చేసేవరకు కదిలేది లేదు’’అని అశ్వని పేర్కొన్నారు.

గురుకుల పాఠశాల విద్యార్థికి పాము కాటు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయంలో ఆరోతరగతి చదువుతున్న మన్వీత్ అనే విద్యార్థిని పాము కాటేసింది. బాత్ రూంకు వెళుతుండగా పాము కాటేసింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటే ఎంతమంది ఆసుపత్రుల పాలు కావాలని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లిలో పాముకాటుకు గురైన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ఘటనపై బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిందించింది.దీనిపై హరీష్ రావు ఎక్స్ లో పోస్టు పెట్టారు.

Tags:    

Similar News