ఏసీబీ విచారణకు హాజరయిన అర్వింద్ కుమార్

పార్ములా ఈ-కార్ రేసు కేసు విషయంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఏమాత్రం అవకాశం వచ్చినా దర్యాప్తును ముందుకు సాగిస్తోంది.;

Update: 2025-01-08 05:11 GMT

పార్ములా ఈ-కార్ రేసు కేసు విషయంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఏమాత్రం అవకాశం వచ్చినా దర్యాప్తును ముందుకు సాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, గ్రీన్ కో సంస్థల్లో సోదాలు చేసింది. కాగా ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను విచారిస్తోంది. ఫార్ములా కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్ బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కాగా ఈ కేసులో ఎప్పటికే అర్వింద్ కుమార్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డ్ చేసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయన చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేసింది.

ఈడీ ఆఫీసుకు బీఎల్ఎన్ రెడ్డి

ఇదెలా ఉంటే మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. రేసు జరిగిన సమయంలో ఆయన చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించారు. దాదాపు రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన ఈడీ విచారణకు ఎదుర్కొంటున్నారు. అయితే కేటీఆర్ ఆదేశాల మేరకు నగదు బదిలీ చేసినట్లు బీఎల్ఎన్ రెడ్డి గతంలోనే చెప్పారు. ఆయన వాంగ్మూలాన్ని కూడా ఏసీబీ రికార్డ్ చేసింది.

Tags:    

Similar News