మొదలైన సీఎం రేవంత్ పాదయాత్ర.. ల్యాబ్‌కు మూసీ నీళ్లు..!

సీఎం రేవంత్ రెడ్డి తన మూసీ పునరుజ్జీవ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర భీమలింగం వరకు 2.5 కిలోమీటర్ల వరకు కొనాగుతుంది.

Update: 2024-11-08 11:16 GMT

సీఎం రేవంత్ రెడ్డి తన మూసీ పునరుజ్జీవ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర భీమలింగం వరకు 2.5 కిలోమీటర్ల వరకు కొనాగుతుంది. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈరోజు పలు కీలక పనులను చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఈరోజు ఉదయం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన పాదయాత్రకు ప్రారంభించారు. ఇందులో భాగంగానే భీమలింగం కాలువలోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ మూసీ ప్రవాహాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ను గీత కార్మికులు కలిసి తమ కష్టాలను వివరించారు. పలు ఇతర అంశాలపై కూడా సీఎంతో ఆయన చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డిని మూసీ నది ప్రవాహం పరిశీలించడం కోసం బోటులో తీసుకెళ్లారు. ఈ సందర్బంగానే సీఎం రేవంత్ రెడ్డి.. ఒక బాటిల్‌లో మూసీ నీటిని సేకరించారు. వాటిని ల్యాబ్ పరీక్షలకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రైతులు, కుల వృత్తిదారులతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకోనున్నారు. చివరిగా నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసే సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణించనున్నారు.

Tags:    

Similar News