సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవు..

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి మూడు రోజుల సెలవు ప్రకటించారు.;

Update: 2025-01-03 06:49 GMT

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి మూడు రోజుల సెలవు ప్రకటించారు. లేడీస్ హాస్టల్‌ బాత్రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టారన్న అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 300పైగా వీడియోలు చిత్రీకరించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వసతి గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాత్‌రూమ్ విండో దగ్గర ఇద్దరు వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్‌ను కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో దర్యాప్తులో మరింత వేగం పెంచారు. ఈ క్రమంలోనే హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వారి వేలి ముద్రలను కూడా దర్యాప్తు బృందం సేకరించింది. ఈ క్రమంలోనే ఈ అంశంపై స్పందించిన కళాశాల యాజమన్యం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో పోలీసులు దర్యాప్తు పూర్తి చేయాలని, తనిఖీలు చేయడంతో పాటు అందరి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్‌లను కూడా వారి పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

తమకు న్యాయం చేయాలని, సీక్రెట్ కెమెరాలను అమర్చిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ధర్నా బాట పట్టడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ పిల్లలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, ఒక్క వీడియో కూడా బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థినుల వ్యవహారంగా ఘాటుగా స్పందిస్తోంది. ఇంతలోనే మహిళా కమిషన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదుచేసింది. కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. సమగ్ర విచారణ జరపాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు తమ దర్యప్తులో వేగం పెంచారు.

Tags:    

Similar News