Manchu Family | మంచు ఫ్యామిలీలో కలహాలు, తండ్రీ కొడుకుల ఘర్షణ
సినీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు మరోసారి రచ్చకెక్కాయి.ఈ సారి తండ్రీ మోహన్ బాబు, కుమారుడు మంచు మనోజ్ ల మధ్య రాజుకున్న రచ్చ పోలీసుస్టేషనుకు ఎక్కింది.
By : The Federal
Update: 2024-12-08 07:34 GMT
ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రాజుకున్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. తండ్రీకొడుకులైన మంచు మోహన్ బాబు మంచు మనోజ్ లు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి.
ఆస్తుల, స్కూలు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య వివాదంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారనే వార్త పొద్దుటి నుంచి వైరల్ అవుతూ ఉంది. తండ్రీ కొడుకులు ఒకరిపై మరొకరు ఫహాడిషరీఫ్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసుకున్నారని చెబుతున్నారు. మంచు మనోజ్ కు ఈ దాడిలో గాయాలు కూడా అయ్యాయట. తనపైనే కాకుండా తన భార్యపైన కూడా తండ్రి మోహన్ బాబు దాడి చేశాడని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబంలో వివాదం
మోహన్ బాబు కుటుంబంలో వివాదం నెలకొంది. ఆస్తుల వివాదంలో తనను మోహన్ బాబు తనను కొట్టాడని, తన భార్యపై కూడా దాడి చేశాడని తండ్రిపై పీఎస్ లో మనోజ్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
మంచు మనోజ్ పై మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లు మరో కథనం వెలుగులోకి వచ్చింది. స్కూలు ఆస్తుల విషయంలో వివాదం ఏర్పడింది. విద్యానికేతన్ సంస్థలో వినయ్ కీలక పదవిలో ఉన్నారు. వినయ్ కొంతమందితో కలిసి మనోజ్ పై దాడి చేశాడని అంటున్నారు. గతంలో మంచు మనోజ్ రెండో పెళ్లి విషయంలోనూ అతని సోదరుడు మంచు విష్ణు తీరు వివాదాస్పదమైంది.
తమ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవని, అసత్యప్రచారాలని మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పేరిట ప్రకటన విడుదల చేశారు. మొత్తంమీద మంచు కుటుంబంలో రాజుకున్న విబేధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సినిమా పరిశ్రమలో మంచు ఫ్యామిలీలో రాజుకున్న వివాదం సంచలనం రేపుతోంది.