పచ్చని కాపురంలో వివాహేతర చిచ్చు
భర్తను కడతేర్చి ఆత్మహత్యగా చిత్రీరణ
By :  B Srinivasa Chary
Update: 2025-07-05 12:10 GMT
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భర్త నిలదీశాడు. ప్రవర్తన మార్చుకోవాలన్నాడు. అయినా వినలేదు. భర్తను చంపేస్తే ప్రియుడితో ఉండిపోవొచ్చు అనుకున్న భార్య చివరకు భర్తను కడతేర్చింది.
     నారాయణ పేటకు చెందిన అంజిలప్ప కు అదే  ప్రాంతానికి చెందిన రాధతో  నెల రోజుల  క్రితం వివాహమైంది.బ్రతుకు దెరువు కోసం  వీళ్లు  మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లికి  వచ్చి స్థిరపడ్డారు.  పెళ్లి కాకమునుపే రాధకు ఓ వ్యక్తితో పరిచయం  ఏర్పడింది. ఈ పరిచయం  కాస్త అక్రమ  సంబంధానికి దారి తీసింది. పెళ్లయిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగించింది.  ఆ నోటా ఈ నోటా భర్త అంజిలప్పకు చేరింది.  భార్యా భర్తల మధ్య గొడవలు జరిగాయి. పద్దతి  మార్చుకోవాలని భర్త చెప్పిన పాపానికి రాధ అతనిపై కక్ష్య గట్టింది.  భర్త మద్యం సేవించినప్పుడు   గొంతునులిమి  దారుణంగా చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా భర్త  స్వగ్రామం నారాయణ పేటకు తీసుకెళ్లింది. గొంతుపై మరకలు ఉండటంతో కుటుంబసభ్యులకు అనుమానమొచ్చింది.  పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేస్తే రాధ  అసలు విషయం చేప్పేసింది. భర్త అంత్యక్రియలు  కాగానే పోలీసులు  రాధతో బాటు ప్రియుడిని  అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు.