ఈ ఐదు జిల్లాల్లోనే కొత్త రేషన్ కార్డులు ఎక్కువ

రేషన్ కార్డుల అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం కొత్త పద్దతిని అవలంభిస్తోంది.;

Update: 2025-01-18 11:46 GMT

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే అర్హుల జాబితాను కూడా సిద్ధం చేసింది. జిల్లాల వారిగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిలో వడబోత చేసి అర్హులను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులకు అర్హమైనవిగా పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు పంపింది. ఈ నెల 20 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తారు. వీటిలో అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత తుది జాబితాను ఖరారు చేస్తారు అధికారులు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చే జాబితాల ప్రకారం పౌరసరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రులు కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఐదు జిల్లాలు అత్యధిక కొత్త రేషన్ కార్డులు పొందనున్నాయి.

పద్దతి మారింది..

ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు అందించాలంటూ ముందుకు ప్రజల నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్దతుల్లో దరఖాస్తులు స్వీకరించే వారు. వాటిని పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసేవారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం కొత్త పద్దతిని అనుసరిస్తోంది. గతేడాది నవంబర్‌లో చేపట్టిన కుటుంబ సర్వే ఆధారంగా అర్హులను గుర్తిస్తోంది. ఆ సర్వే ఆధారంగానే తెలంగాణలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించారు. కొత్త కార్డులు కావాలని కోరినవారివి, ఇప్పటికే ఉన్నకార్డుల్లో పేర్లను నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నవారి సమాచారాన్ిన అధికారులు వడబోశారు. ఈ ప్రక్రియ పూర్తియ్యేసరికి రాష్ట్రంలో 6,68,309 కుటుంబాలు కొత్త కార్డులను అర్హమైనవిగా గుర్తించారు. ఈ కుటుంబాల్లో 11,65,052 మంది పేర్లు ఉన్నాయి. గ్రామ, బస్తీ సభల తర్వాత కొత్త కార్డుల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.

అత్యధికంగా పొందే జిల్లాలు ఇవే..

ఇప్పటి వరకు అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌ 83,285 కొత్త రేషన్ కార్డులు పొందనుంది. ఆ తర్వాత స్థానాల్లో నిజామాబాద్ 39,131, ఖమ్మం 37,152, భద్రాద్రి-కొత్తగూడెం 29,141, రంగారెడ్డి 29,405 కుటుంబాలు కొత్త రేషన్ కార్డులను అర్హమైనవిగా గుర్తించారు. అదే విధంగా అత్యల్పం జాబితాలో వనపర్తి 6,647, ములుగు 7,198, జయశంకర్ భూపాలపల్లి 8,191, రాజన్న-సిరిసిల్ల 9,731, జనగామ 9,997 కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు అందుకోనున్నాయి.

కొత్త కార్డులను సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతకాలతో ముందుగా లేఖ ఇస్తారు. కొంతకాలం తర్వాత పాతవారికి, కొత్తవారికి కొత్త రూపంలో రేషన్ కార్డులు జారీ చేస్తారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల డిజైన్ ఖరారు కావాల్సి ఉంది.

Tags:    

Similar News