కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు ఓటు వేయకుంటే తన కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.;
కరీంగనర్ జిల్లా కమలాపురం పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఓ కేసు నమోదయింది. కాగా తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈరోజు ఈ కేసులో తన తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఈ విషయంలో న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందనేది చర్చలకు దారితీస్తోంది. తమ నేత కౌశిక్‌పై నమోదయింది తప్పుడు కేసు అని న్యాయస్థానానికి కూడా అవగతం అయిందని, తీర్పు కౌశిక్‌కు సానుకూలంగానే వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా తనకు ఓటు వేయకుంటే తాను, తన కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించే కమలాపురం పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కోర్టులో విచారణ సమయంలో కూడా రాజకీయ కక్షల వల్లే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారని ఆయన తరుపు న్యాయవాది వివరించారు.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటు వేయకుండా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓటర్లను బెదిరించే ప్రయత్నాలు కౌశిక్ రెడ్డి చేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం.. సాక్షులుగా ఉన్న ఓటర్ల వాంగ్మూలాన్ని ఎందుకు నమోదు చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.