"42శాతం కోటాకోసం ఎంతకైనా తెగిస్తాం"
డిసైడ్ చేశాక వెనక్కు పోదు రేవంత్ ప్రభుత్వం... అంటున్న భట్టి;
ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగానే ఉన్నట్లుంది. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పింది చూస్తుంటే ఈ విషయం అర్ధమైపోతోంది. ఇంతకీ భట్టి ఏమిచెప్పారంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై(BC Reservations) న్యాయపరమైన సమస్యలువస్తే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
కులగణన ఆధారంగానే తమప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు. కులగణకు బీజేపీ మొదటినుండి వ్యతిరేకంగానే ఉందన్న విషయాన్ని భట్టి గుర్తుచేశారు. కులగణన అవసరంలేదన్న బీజేపీ ప్రకటనను గుర్తుచేశారు. రేవంత్(Revanth) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధి(Rahul Gandhi) ఒత్తిడి కారణంగా జనగణనలోనే కులగణన కూడా చేస్తామని నరేంద్రమోదీ(Narendra Modi) ప్రకటించినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉందన్నారు. ఆ బిల్లుకు పార్లమెంటులోని అన్నీపార్టీలమద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు(BC Reservations) మద్దతిచ్చిన పార్టీలన్నీ పార్లమెంటులో కూడా మద్దతు ఇవ్వాలని భట్టి విజ్ఞప్తిచేశారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారు.
పనిలోపనిగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. రావుకు బీసీలంటే బాగా చిన్నచూపుందన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. రావు తనకు ఇచ్చిన లీగల్ నోటీసులకు ఎలాగ సమాధానం చెప్పాలో తనక తెలుసన్నారు. తాము కులగణను చాలా పకడ్బందీగా చేశాము కాబట్టే కేంద్రం కూడా కులగణను చేయాలని డిసైడ్ చేసిందని భట్టి అభిప్రాయపడ్డారు.