IT raids on Dil Raju|దిల్ రాజు ఇంటిపై ఐటి రెయిడ్
పై ఇద్దరు ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలంలో మొత్తం 8 చోట్ల 55 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి.;
ప్రముఖ సినీనిర్మాత, పంపిణీదారుడు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఇంటిపై మంగళవారం ఉదయం ఐటి దాడులు9IT Raids) జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దిల్ రాజు(Dil raju) ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులుచేసి సోదాలుచేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు నిజామాబాద్ లోని ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు పుష్ప సినిమా-2(Pushpa-2 Movie) నిర్మాత ఎర్నేని నవీన్ ఇల్లు, ఆఫీసులపైన కూడా దాడులుచేశారు. పై ఇద్దరు ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలంలో మొత్తం 8 చోట్ల 55 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు తమ్ముడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి. సినిమానిర్మాణాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలు, లాభ,నష్టాలు, హీరో,హీరోయిన్లతో పాటు ఇతర సాంకేతికనిపుణులకు చెల్లించిన రెమ్యునరేషన్ తదితర వివరాలను అధికారుల బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.