బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్, హరీష్

జీహెచ్ఎంసీ సర్వసభ్య సమవేశం నేపథ్యంలో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలో గందరగోళం సృష్టించిన కారణంగా వారిని అరెస్ట్ చేశారు.;

Update: 2025-01-30 10:48 GMT

జీహెచ్ఎంసీ సర్వసభ్య సమవేశం నేపథ్యంలో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలో గందరగోళం సృష్టించిన కారణంగా వారిని అరెస్ట్ చేశారు. కాగా సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రజా సమస్యలపై చర్చ జరగాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తమ పార్టీ కార్పొరేటర్లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు అడిగితే అరెస్ట్‌లు చేస్తారా? అని హరీష్ రావు మండిపడ్డారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీలో చర్చలేకుండా బడ్జెట్‌ను ఆమోదించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. నిధులు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తే సభ నుంచి బయటకు గెంటేస్తారా? అని కేటీఆర్ కూడా నిలదీశారు.

ప్రశ్నిస్తే అరెస్ట్‌లా?

‘‘హైదరాబాద్‌ను పట్టించకోలేదని ప్రశ్నిస్తే బీార్ఎష్ కార్పొరేటర్లను అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. నిధులు ఇవ్వట్లేదని అడిగితే బయటకు గెంటేస్తారా? అరెస్ట్ చేసిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలి. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా, మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జిహెచ్ఎంసి అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ నిరంకుశత్వానికి మరో నిదర్శనం: హరీష్

‘‘జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా? రాష్ట్రానికి గుండె కాయ లాంటి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తున్న మీ వైఖరిని నిలదీస్తే మార్షల్స్ తో కార్పొరేటర్లను బడ్జెట్ కౌన్సిల్ నుంచి బయటికి పంపిస్తారా? బడ్జెట్ మీద ఎలాంటి చర్చ లేకుండానే అమోదిస్తున్నట్లు ప్రకటించడం అప్రజాస్వామికం. మీ నిరంకుశ వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రజల తరుపున ప్రశ్నించే ప్రజాప్రతినిధుల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు తెలిపారు.

Tags:    

Similar News