జిల్లాల పర్యటనకు కేటీఆర్ రెడీ..
కేసీఆర్ చేపట్టిన డ్యామేజ్ కంట్రోల్ చర్యలేనా.;
జిల్లాల్లో పర్యటించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడీ అయ్యారు. తన పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు. వారం రోజులుగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో కేటీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఏడు రోజులుగా జరుగుతున్న చర్చలు ఈ పర్యటనలకు సంబంధించేనని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. అందుకోసం జిల్లాల పర్యటన చేయాలని కేటీఆర్‌కు సూచించిన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా బీర్ఎస్‌లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక తీవ్ర చర్చలు దారితీస్తుంటే ఇంతలో కవిత ఎపిసోడ్ ఊహించని మలుపు తీసుకుంది. హరీష్ రావుపై ఆమె ఆరోపణలు చేయడం, పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, మరుసటి రోజే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయడం ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా బీఆర్ఎస్‌లో కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాలు పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకం, భరోసాపై ప్రభావం చూపాయి. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరగలేదని బీఆర్ఎస్ పదేపదే చెప్తున్న సమయంలో కవిత వచ్చి అవినీతి జరిగిందంటూ సర్టిఫికెట్ ఇవ్వడం తీవ్ర చర్చలు దారితీయడంతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు బలమైన ఆయుధాన్ని కూడా అందించాయి.
వాటి నుంచి తప్పించుకుంటూ ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అందుకోసమే కేటఆర్ చేత జిల్లాల పర్యటన చేయిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. వాటిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ తీవ్రంగా ఉందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తప్పదని కేసీఆర్ అంచనా వేశారని, అందుకే వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారని టాక్.