రేవంత్ ప్రభుత్వంపై కెటీఆర్ హాట్ కామెంట్స్

ఎక్స్ వేదికగా ఆరోపణలు;

Update: 2025-07-06 10:31 GMT

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు.రైతు రుణ మాఫీ లేకుండా పోయిందని కెటీఆర్ మండిపడ్డారు.రైతులు అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేద్దామనుకుంటే కనీసం ఎరువులు కూడా లేకుండా పోయిందని బిఆర్ఎస్ నేత ఏకరువు పెట్టారు.

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కెటీఆర్ స్పందించారు. ఆధార్ కార్డులు అడగగానే రైతులు ఇచ్చినప్పటికీ కనీసం బస్తా ఎరువు కూడా ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకని కెటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు లోటు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, కారణాలు ఏమిటో ప్రకటిస్తే బాగుంటుందని కెటిఆర్ అన్నారు. బస్తా యూరియా రూ 266.50 పైసలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం రూ 325 ఎలా అయ్యిందో రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏర్పడిందని కెటిఆర్ ఆన్నారు ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరో తెలియజేయాలన్నారు. ఎరువుల కృత్రిమ కొరతకు కారకులు ఎవరు అనేది విచారణ జరపాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. చివరకు ఎరువులను బుక్కేస్తున్న నేతలు ఎవరో బయటపెట్టాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News