Vice President Election | ‘బీఆర్ఎస్ మద్దతు అవసరంలేదు’

బీఆర్ఎస్(BRS) ను సపోర్టు ఇవ్వమని ఎవరు అడిగారు ? అని కిషన్ మీడియాను ఎదురు ప్రశ్నించారు.;

Update: 2025-08-21 08:48 GMT
NDA Vice President Candidate CP RadhaKrishnan

ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు విషయంలో కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ సపోర్టు తమకు అవసరంలేదన్నారు. బీఆర్ఎస్(BRS) ను సపోర్టు ఇవ్వమని ఎవరు అడిగారు ? అని కిషన్ మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఎన్డీయే కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) గెలుపుకు బీఆర్ఎస్ ఓట్లు అవసరమే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో(Vice President Election) మద్దతు కోసం తమను ఏకూటమీ సంప్రదించలేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటనకు కిషన్(Kishan Reddy) సమాధానం చెప్పేశారు.

కిషన్ తాజా ప్రకటనను లెక్కతీసుకుంటే ఏ ధైర్యంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు అవసరంలేదని చెప్పారు ? ఏధైర్యంతో అంటే బీఆర్ఎస్ ఎంపీల ఓట్లు, మద్దతు అవసరంలేకపోయినా ఎన్డీయే అభ్యర్ధి గెలుపు ఖాయం గనుకనే. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలకు మాత్రమే ఓటుహక్కుంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఎంపీలతో పాటు ఎంఎల్ఏలు కూడా ఓటింగులో పాల్గొంటారు. కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీన జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్ సభ, రాజ్యసభలోని 788 ఎంపీలు మాత్రమే ఓటర్లు. వీరిలో లోక్ సభలో 543 మంది ఎంపీలుండగా, రాజ్యసభలో 245 మంది ఎంపీలున్నారు.

మొత్తం 788 మంది ఎంపీల్లో ఎన్డీయే కూటమిబలం 423 కాగా ఇండియా కూటమి ఎంపీలబలం 313 మాత్రమే. ఎన్డీయేని వ్యతిరేకించే పార్టీలన్నీ ఇండియాకూటమికి మద్దతిస్తాయని అనుకోవటం తప్పు. కొన్ని పార్టీలు అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమికి సమదూరం పాటిస్తున్నాయి. కొన్నిపార్టీలు అవసరార్ధం మద్దతు పలికితే పలకచ్చు. ఎన్డీయే కూటమిని వ్యతిరేకించే పార్టీల ఓట్లన్నీ ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ బీ సుదర్శనరెడ్డికి ఓట్లు వేస్తారని అనుకున్నా పడేఓట్లు 313మాత్రమే. అంటే ఎన్డీయే ఎంపీల బలం 423తో చూసినపుడు ఇండియా కూటమికి పడతాయని అనుకుంటున్న ఎంపీలబలం 313మాత్రమే. 110 ఓట్ల ఆధిక్యత ఎన్డీయే కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు స్పష్టంగా కనబడుతోంది.

ఈలెక్కలన్నీ వేసుకున్న తర్వాతే బహుశా కిషన్ రెడ్డి బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరంలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. బీఆర్ఎస్ మద్దతు అవసరంలేదని చెప్పిన తర్వాత కూడా ఎన్డీయే కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయిస్తారా ? లేకపోతే ఓటింగుకు దూరంగా ఉండాలని డిసైడ్ చేస్తారా చూడాలి.

Tags:    

Similar News