ఎస్‌ఎల్‌బీసీలో లభించిన మృతదేహం
మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు.;
By : The Federal
Update: 2025-03-09 13:54 GMT
ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో చేపట్టిన సహాయక చర్యల్లో కీలక పురోగతి వచ్చింది. తొలి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో డీ-2 పాయింట్‌లో మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం ఉదయం ఒక మృతదేహం కుడిచేయి కనిపించడంతో అక్కడ తవ్వకాలు చేసి సాయంత్రానికి ఒక మృతదేహాన్ని విజయవంతంగా బయటకు తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.