హైదరాబాద్‌లో కాల్పులు.. అలెర్ట్ అయిన పోలీసులు
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగలు చేసిన కాల్పులు కలకలం రేపాయి.;
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగలు చేసిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో ఆగంతుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరబాద్ సహా బీహార్, రాయ్‌పూర్‌తో పాటు పలు అనుమానిత ప్రాంతాల్లో గాలింపులు కొనసాగుతున్నాయి. అయితే ఈ అంశంలో కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బీహార్‌కు చెందిన అమిత్ కుమార్ గ్యాంగ్ ఈ కాల్పులకు కారణమని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. బీదర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం దోపిడీ చేసి ఇద్దరు పరారయ్యారు. వారి కోసం గాలించుకుంటూ హైదరాబాద్‌కు పలువురు పోలీసులు చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే దుండగులు కాల్పులు చేశారు. బీదర్ నుంచి హైదరాబాద్‌లో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని వాళ్లు ప్లాన్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
హైదరాబాద్‌లో కాల్పులు జరిపిన ముఠా బీహార్‌కు పారిపోయిందా? ఇక్కడే ఎక్కడైనా దాక్కుని ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తును ముందుకు సాగిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బీహార్ పోలీసులను సప్రందించారు పోలీసు ఉన్నతాధికారులు. అమిత్ కుమార్ నేరాల చిట్టా గురించి ఇప్పటికే తెలుసుకున్నారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, శాంతిభద్రత విభాగం అన్నీ కలిసి ఈ ముఠా కోసం గాలింపులు చేస్తోంది.
అసలు ఏం జరిగిందంటే..
బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వచ్చిన ఇద్దరు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదు దొంగలించారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు. ఆ తర్వాత వారిని పోలీసులు హైదరాబాద్‌లో గుర్తించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటుకుని వారు హైదరాబాద్ చేరుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అప్జల్‌గంజ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో రాయ్‌పుర్ వెళ్లడానికి వారు ప్రయత్నించారు. కాగా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేసి డబ్బులు కట్టలు ఉండటంతో ప్రశ్నించారు. దాంతో వారిపై పలు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. హైదరాబాద్‌లో జరిపిన కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దృష్టి సారించారు.