అంత్య క్రియలను అడ్డుకున్న పోలీసులు

కల్తీ కల్లు ఘటనలోట్విస్ట్;

Update: 2025-07-09 13:11 GMT

హైద్రాబాద్ కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో మహిళ మృతి చెందింది. కల్తీ కల్లు తాగిన స్వరూపరాణికి వాంతులు, విరోచనాలయ్యాయి. కుటుంబ సభ్యులు ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కుటుంబ సభ్యులు అంత్య క్రియలు నిర్వహిస్తుండగా పోలీసులకు సమాచారమందింది. ఆమె శవాన్ని పాడెకు కట్టి స్మశాన వాటికకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. చావుకు హాజరైన బంధు మిత్రులు నిశ్చేష్టులయ్యారు. 

కల్తీ కల్లు తాగిన ఘటనలో ఆమె చనిపోయినట్టు పోలీసులకు కన్ఫర్మ్ కావడంతో శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

కాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారాం (47) చనిపోయాడు. దీంతో కల్తీ కల్లు తాగి చనిపోయినవారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

కల్లు కాంపౌండ్ లు నిర్వహిస్తున్ననగేశ్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, బి. శ్రీనివాస్ గౌడ్, తీగల రమేశ్ పై కేసు నమోదు చేశారు. బాధితులు గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 20 మంది ఐసీయులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News