కొరియాపై రేవంత్ మనసు పారేసుకున్నారా ?

అమెరికాకు వెళ్ళి అక్కడి నుండి దక్షిణకొరియాలో పర్యటించినపుడు సియోల్(Seoul) లోని చంగ్ యే చున్ (Cheonggyecheon) నది సుందీరకరణ చూసి మనసు పారేసుకున్నారు.

Update: 2024-10-23 05:49 GMT
Revanth with Ki-Hak Sung

అధికారంలో ఉన్నపుడు పాలకులు ఒక్కో దేశాన్ని అమితంగా ఇష్టపడతారు. అచ్చంగా ఆదేశం లాగే తమ రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయబోతున్నట్లు పదేపదే చెబుతారు. తాము కలలు కన్నట్లుగా డెవలప్ చేస్తారా లేదా అన్నది వేరేసంగతి. తాము అధికారంలో ఉన్నంతకాలం తామిష్టపడిన దేశాన్ని వీలైనంతగా ప్రమోట్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఇపుడు ఇదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth  Reddy)కి దక్షిణకొరియా(South Korea) పైన బాగా ఇష్టం పెరిగిపోతున్నట్లుంది. 2014-19 మధ్య చంద్రబాబునాయుడు(ChandraBuabu) సింగపూర్(Singapore), జపాన్(Japan) తరహా డెవలప్మెంట్ ను కోరుకున్నారు. అలాగే కేసీఆర్(KCR) పదేళ్ళ అధికారంలో ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్(Istanbul) లాగ డెవలప్ చేస్తానని, హైదరాబాద్ ను అమెరికాలోని(America) డల్లాస్(Dallas), వాషింగ్టన్(Washington) లాగ డెవలప్ చేస్తానని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు. ఇపుడు రేవంత్ కూడా దక్షిణకొరియా డెవలప్మెంట్ మోడల్ ను బాగా కలవరిస్తున్నారు.

తాను అమెరికాకు వెళ్ళి అక్కడి నుండి దక్షిణకొరియాలో పర్యటించినపుడు సియోల్(Seoul) లోని చంగ్ యే చున్ (Cheonggyecheon) నది సుందీరకరణ చూసి మనసు పారేసుకున్నారు. అదే తరహాలో హైదరాబాద్ లోని మూసీ(Musi river)నది పునరుజ్జీవనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అలాగే కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటి(Korea National Sport University)లోని నిపుణులతో భేటీ అయ్యారు. హైదరాబాద్, ఫోర్త్ సిటిలో తాను ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్పార్ట్ యూనివర్సిటి(Young India Sports University)లో కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. తాజాగా ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో పాపులరైన దక్షిణకొరియా సంస్ధ యంగ్ వన్ కార్పొరేషన్(Youngone Corporation) తో ఒప్పందం చేసుకోబోతున్నారు. సియోల్ లోని యంగ్ వన్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో ఛైర్మన్ కిహాక్ సంగ్(Ki-Hak Sung) తో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti), పొన్నం ప్రభాకర్(Ponnam), ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.



 తొందరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్న ఫోర్త్ సిటీ(Fourth City)లో 20 ఎకరాలు కేటాయించటానికి ఇప్పటికే రేవంత్ అంగీకరించారు. ఒప్పందం సజావుగా కుదిరితే ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ(Fashion Technology University)ని ఏర్పాటు చేస్తామని కిహాక్ సంగ్ మంత్రులకు హామీ ఇచ్చారు. జరుగుతున్నది చూస్తుంటే దక్షిణకొరియా డెవలప్మెంట్ మోడల్ ను తాను కూడా అనుసరించాలని రేవంత్ బాగా డిసైడ్ అయిపోయినట్లున్నారు. అందుకనే తెలంగాణాలో ఎక్కడ సమావేశంలో మాట్లాడినా రేవంత్ పదేపదే దక్షిణకొరియా డెవలప్మెంట్ నే ఉదాహరణగా చెబుతున్నారు. ఇప్పటికి మూసీనది పునరుజ్జీవనంకు సియోల్ లోని చంగ్ యే చున్ నది సుందీరకరణనుండి, రాబోయే ఒలంపిక్స్(Olympics) లో దేశానికి బంగారు పతకాలు(Gold Medals)సాధించటంలో కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటి నుండి, ఫ్యాషన్ టెక్నాలజీలో తెలంగాణా(Telangana) ముద్ర వేయటానికి యంగ్ వన్ కార్పొరేషన్ నుండి రేవంత్ స్పూర్తిపొందినట్లు అర్ధమవుతోంది.

డెవలప్మెంట్ లో దక్షిణకొరియాను రేవంత్ బాగా ఇష్టపడ్డారు కాబట్టే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా సౌత్ కొరియా సంస్ధలతో ఒప్పందాలు చేసుకుని ఆ సంస్ధలను హైదరాబాద్ కు తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో ప్రపంచంలో అభివృద్ధిచెందిన దేశాల్లో ఒకటైన దక్షిణకొరియాను ఉదాహరణగా తీసుకోవటంలో, స్పూర్తి పొందటంలో తప్పేలేదు. కాకపోతే ఆ దేశం డెవలప్ అవటానికి అనుసరించిన మార్గాలు ఏమిటి ? పాలకులు, అధికారుల్లోని చిత్తశుద్ది ఏమిటన్నది కూడా గమనించి అదే స్పూర్తితో తెలంగాణా డెవలప్మెంట్ కు బాటలు వేస్తే సంతోషించాల్సిన విషయమే. ఇప్పటికైతే దక్షిణకొరియాలోని పై సంస్ధల ప్రభావం రేవంత్ పైన కనబడుతోంది. ముందుముందు ఇంకెన్ని సంస్ధలు తెరమీదకు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News