మూసీ పునరుజ్జీవన పథకంలో మరో కీలక స్కీమ్

ప్రారంభానికి రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం. ఓకే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.;

Update: 2025-09-07 13:36 GMT

మూసీ పునరుజ్జీవన పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పథకాన్ని చేపట్టడానికి రెడీ అయింది. ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి.. సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రూ.7,36 కోట్లతో చేపట్టనుంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ప్రభుత్వం రెండేళ్ల డెడ్‌లైన్‌ను పెట్టుకుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అదే విధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిపండంతో పాటు మూసీ పునరుజ్జీవననానికి 2.5 టీఎంసీల నీటికి కేటాయించనున్నారు. మిగిలిన 17.50 టీఎంసీలను హైదరాబాద్ తాగు నీటి అవసారలకు వినియోగించనున్నారు. ఈ మార్గమద్యలోని 7 చెరువులను సైతం నింపుతారని అధికారులు చెప్పారు. ప్రాజెక్ట్ అనుకున్న విధంగా సాగితే 2027 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి వాటా పెడుతుండగా మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్ట్ సంస్థ సమకూర్చుతుంది. 

Tags:    

Similar News