రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు: పొంగులేటి

వచ్చే శాసనసభ సమావేశాల్లోపు 2025 సవరణ బిల్లు;

Update: 2025-07-06 11:27 GMT

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ రెవిన్యూశాఖా మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి సూచనా ప్రాయంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగా రిజిస్టేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ప్రతిపాదనను సిద్దం చేసినట్టు పొంగులేటి చెప్పారు. 2021లో భారతీయ స్టాంపుల చట్టంలో నాలుగు సెక్షన్లు, 26 ఆర్టికల్స్ పై సవరణ బిల్లు రాష్ట్ర శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ పలు అభ్యంతరాలు చెప్పిందని పొంగులేటి చెప్పారు. వాటిపై క్లారిఫికేషన్స్ పంపినప్పటికీ కేంద్రం ఆమోదించకుండా 2023లో తిరిగి రాష్ట్రానికి పంపిందన్నారు.

ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలపై శనివారం సచివాలయంలో సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రెవిన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్, న్యాయ వ్యవహారాల కార్యదర్శి తిరుపతి, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, సిఎంవో ఓఎస్టీ వేముల శ్రీనివాస్ తో మంత్రి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 2025 సవరణ బిల్లు తీసుకురావాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్దం చేయాలన్నారు.

Tags:    

Similar News