Telangana CM | ప్రజలకు సీఎం రేవంత్ మూడు వరాలు, జనవరి 26 నుంచి అమలు

2025వ కొత్త సంవత్సరంలో ప్రజలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మూడు వరాలు ప్రకటించారు. జనవరి 26 నుంచి సీఎం రేవంత్ రెడ్డి మూడు పథకాలు అమలు చేస్తామని చెప్పారు.;

Update: 2025-01-04 16:15 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం వేళ మూడు వరాలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ చెప్పారు.

- వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతమున్న రూ.10వేల రైతు భరోసాను రూ.12వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
- భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు.భూమిలేని వ్యవసాయ రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకూలీలకు ఇస్తామని చెప్పారు.
- రేషన్ కార్డు లేనివారికి నూతన రేషన్ కార్డులు ఈ నెల జనవరి 26వ తేదీ నుంచి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.మూడు పథకాలను జనవరి 26తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం వివరించారు.
వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదని సీఎం చెప్పారు.ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వ విధానం అని ఆయన పేర్కొన్నారు.పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలకు క్యాబినెట్ ఆమోదించింది.ములుగు గ్రామపంచాయతీని ములుగు మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.


Tags:    

Similar News