ఆకాశాన్నంటుతున్న విద్యుత్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సరఫరా, డిమాండ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది.;

Update: 2025-02-19 07:23 GMT

వేసవి వస్తుందంటే విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వంటివి 24 గంటల పాటు పనిచేస్తూనే ఉంటాయి. దీంతో నిరంతర సరఫరా అందించడం ప్రభుత్వం, అధికారులకు అతిపెద్ద సవాల్‌గా మారుతోంది. ప్రతి ఏడాది వేసవి వస్తుందంటే విద్యుత్ సరఫరా ఎలా అనే అంశం ప్రభుత్వాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంటాయి. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సరఫరా, డిమాండ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విద్యుత్ అంతరాయాలతో ఇబ్బంది పరడకూడదని ఆదేశాలు కూడా జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో అధికారులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకన్నారు.

కాగా ప్రభుత్వం అనుకున్న అధిక డిమాండ్ ఈ ఏడాది ఇంకాస్త ముందే వచ్చింది. ఫిబ్రవరి నెలలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మాంచి ఎండా కాలం వస్తే పరిస్థితి ఏంటి? అని ప్రజలు ఆలోచనలో పడిపోయారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ కూడా భారీ పెరిగిపోయింది. రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఫిబ్రవరి నెలలో విద్యుత్ డిమాండ్ 16వేల మెగావాట్లకు చేరిందని వారు చెప్తున్నారు. తెలంగాణలో 19 ఫిబ్రవరి 2025 ఉదయం 7గంటల 55 నిమిషాలకు అత్యధికంగా 16,058 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయింది.

అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యుత్ అంతరాయం లేకుండా ప్రతి ఒక్కరి అవసరాలకు కరెంట్ అందుతుందని భట్టి చెప్పారు. ఈరోజు ఆయన విద్యుత్ సంస్థల సీఎండీలతో రాష్ట్రంలోని విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతటి డిమాండ్ వచ్చినా విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం ఉండకూడదని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భట్టి చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, విద్యుత్ వినియోగం మరింత పెరిగినా అంతరాయం లేకుండా చర్యలు ఎలా తీసుకోవాలో చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News