మున్నేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు

సేఫ్ గా మరో ఇద్దరు;

Update: 2025-07-05 08:06 GMT

ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో విషాదం చోటు చేసుకుంది. చింతకాని మండలం చినమండవ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను మున్నేరు వాగు కబలించింది.

బైక్ కడుగుదామని నలుగురు యువకులు మున్నేరువాగులో దిగారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు. 23 ఏళ్ల కాసిమల్లి నాగ గోపి బిటెక్ చదువుతున్నాడు.19 ఏళ్ల నందకిషోర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ స్వంత అన్నదమ్ములు. స్నానం చేయడానికి మున్నేరువాగుకు వచ్చిన వీళ్లు తమ వెంట తెచ్చుకున్న బైక్ ను కడగాలని వాగులోకి దిగారు. వాగు లో నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో ఇద్దరు అన్నదమ్ములు బైక్ ను ఒడ్డుకు తెచ్చే క్రమంలో నీళ్లలో కొట్టుకుపోయారు. అదే వాగులో మరో ఇద్దరు యువకులు బైక్ కడగాలని ప్రయత్నించి నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు ఇద్దరు యువకులను ఒడ్డుకు తీసుకువచ్చి రక్షించారు.

కృష్ణా నదికి ఉపనది అయిన మున్నేరు నది వరంగల్ జిల్లా పాకాల సరస్సలో పుట్టింది. అయితే మున్నేరువాగు ఖమ్మం, నల్లొండ, ఎన్టీఆర్ జిల్లాల గుండా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. వేలాది ఎకరాలకు సాగునీరు , లక్షలాది మందికి దాహార్తిని తీరుస్తున్న మున్నేరువాగు ఇద్దరుయువకులను బలితీసుకుని బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Tags:    

Similar News