గొంతులో పూరి ఇరుక్కుని యువకుడు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం;

Update: 2025-07-07 05:56 GMT

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామం లో తొలి ఏకాదశ రోజు విషాదం చోటు చేసుకుంది. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి పొలంలో 25 ఏళ్ల బ్యాగరీ కుమార్, గిరయ్యలు పని చేస్తున్నారు. పొలం పనులు చేస్తున్న సమయంలో వీళ్లకు రాంరెడ్డి టిఫిన్ చేయడానికి పూరి తీసుకొచ్చారు. ఇద్దరు కల్సి పూరి తింటుండగా గిరయ్య గొంతులో పూరి ఇరుక్కుంది. పక్కనే ఉన్నగిరయ్య మంచినీళ్లు తీసుకొచ్చాడు. గొంతు మధ్యలో పూరి ఇరుక్కోవడంతో కుమార్ కు ఊపిరాడలేదు. కొద్దిసేపు కొన ఊపిరితోకొట్టు మిట్టాడిన కుమార్ చనిపోయాడు. ఇంటికి పెద్దదిక్కు అయిన కుమార్ చనిపోవడంతో కుటుంబసభ్యుల వేదన అంతా ఇంతా కాదు. పెద్ద కుమారుడు చనిపోవడంతో తల్లి రాజమణి, చెల్లలు తమకు దిక్కెవరు అంటూ విలపించారు.

Tags:    

Similar News