ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై అధిష్టానం గరం గరం
కక్కలేక మింగలేక;
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బిజెపి అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీ లైన్స్ లో పని చేసే వారే ముఖ్యమని పార్టీ అధిష్టానం ఒక ప్రకటనలో తెలిపింది . రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరింది. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు రాజీనామా ఇవ్వొచ్చు బిజెపి ఆ ప్రకటనలో పేర్కొంది. రాజాసింగ్ రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకు వస్తున్నాం అని పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
కాగా రాజాసింగ్ రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది. హాట్రిక్ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం బిజెపిలో చర్చనీయాంశమైంది. రాంచందర్ రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నా. బిజెపి అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కాని నా మద్దత్తు దారులను బెదిరించారు. నామినేషన్ వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వ్యక్తులకే అధ్యక్ష పదవి ఇచ్చారు. అందుకే బిజెపికి రాజీనామా చేస్తున్నాను అని రాజాసింగ్ అన్నారు.
తెలంగాణలో బిజెపి అధికారంలో రావాలని పోరాడుతున్నాను. కానీ మా పార్టీని అధికారంలోరాకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం అన్నీ ధారపోశాను. నేను నా కుటుంబం టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నాము అని రాజాసింగ్ అన్నారు. పార్టీ కోసం ఇంత పని చేసినప్పటికీ ఏం లాభం. పార్టీకి లవ్ లెటర్( రాజీనామా లేఖ) ఇచ్చి వెళుతున్నానని రాజాసింగ్ అన్నారు. మీకో దండం మీ పార్టీకి ఓ దండం అంటూ రాజాసింగ్ రాజీనామా లేఖను ప్రదర్శించారు. బిజెపికి రాజీనామా చేసినప్పటికీ హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని రాజాసింగ్ ప్రకటించారు.