పాశమైలారం కు మీనాక్షి నటరాజన్
ప్రతిపక్షాలను తిప్పి కొట్టడానికి కాంగ్రెస్ సమాయత్తం;
పాశమైలారం ఘటనను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్లే పాశమైలారం ఘటన చోటుచేసుకుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశం మేరకు బుధవారం ఎఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు.ఢిల్లీ నుంచి ఆమె హుటాహుటిన పాశమైలారం చేరుకున్నారు. ముఖ్యమంత్రి జోక్యంతో చనిపోయిన వారికి కోటిరూపాయలు నష్ట పరిహారం ఇస్తున్నట్టు సిగాచి కంపెనీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. బ్లాస్ట్ జరిగిన సోమవారం నుంచే తెలంగాణమంత్రులు పొంగులేటి, వివేక్, దామోదరం రాజనర్సింహా, శ్రీధర్ బాబు అక్కడే మకాంవేసి బాధితులను ఓదారుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మున్ముందు ప్రమాదాలనివారణకు కమిటీ వేస్తామని మంత్రులు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించిన సమయంలో యాజమాన్యాన్ని తీవ్రంగా మందలించారు. నిబంధనల ప్రకారం కంపెనీ నడుపుతున్నారా అని ముఖ్యమంత్రి నిలదీశాారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండటానికిి యాజమాన్యాన్ని ఒప్పించి చనిపోయిన వారికి కోటిరూపాయలు నష్ట పరిహారం ఇప్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
మంత్రి దామోదరం రాజనరసింహా, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు మీనాక్షి నటరాజన్ ను వెంట ప్రమాద స్థలికి చేరుకున్నారు. మరో 18 శవాల డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని, 11 మంది ఆచూకీ దొరకడం లేదని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటున్నట్టు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.